వాణి రెడ్డి కి బెస్ట్ సోషియల్ సర్వీసు అవార్డు ప్రదానం

Facebook
X
LinkedIn

హైదరాబాద్

వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్  ముందుకు వచ్చింది . విజన్ స్టూడియోస్  11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. విజన్ స్టూడియోస్ మొదటి సారిగా నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్ లో  ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా  సామాజిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ సోషియల్ సర్వీసు లో తనకంటూ గుట్టింపు పొందిన వాణి రెడ్డి కి బెస్ట్ సోషియల్ సర్వీసు అవార్డుని ప్రదానం చేసారు. విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ తదితరులు పాల్గొన్నారు.