ఎన్ ఎఫ్ సి  దగ్గర బ్రిడ్జ్ విస్తరణ, మౌలాలి స్టేషన్ ఆధునీకరణ కు కూడా చర్యలు చేపట్టాలి

Facebook
X
LinkedIn

దక్షిణ మధ్య రైల్వే  ఉన్నతాధికారి అరుణ్ కుమార్ జైన్ ని కలిసిన  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

తెలుగునాడు, హైదరాబాద్ :

ఒకవైపున మెట్రో రైల్ చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ ద్వారా హైదరాబాద్ మహానగరంలో  పలు ప్రాంతాల ను  కలుపుతూ నడుస్తున్న ఎం ఎం టి ఎస్ ను పౌరులు సద్వినియోగం చేసుకునే విధంగా  రైల్వే అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని  ఈరోజు దక్షిణ మధ్య రైల్వే  ఉన్నతాధికారి అరుణ్ కుమార్ జైన్ ని కలిసిన సందర్భంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ సూచించారు ఎన్ ఎఫ్ సి  దగ్గర బ్రిడ్జ్ విస్తరణ, మౌలాలి స్టేషన్ ఆధునీకరణ కు కూడా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు , చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రయాణికులకు  కనీస సౌకర్యాలు ఏర్పాటు కొరకు  జిహెచ్ఎంసి ,ఆర్టిసి, ఐ డి సి ,రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేశారు, ఇతర సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు