బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి
యూనియన్ అధ్యక్షుడు డిజి నరసింహారావు
తెలుగునాడు హైదరాబాద్ :
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో గల పవర్ ప్లాంట్ ఫేస్-2 చిమ్నీ వద్ద బుధవారం లిఫ్ట్ తెగిపడటంతో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు – సురేష్ సర్కార్ (21), ప్రకాష్ మండల్ (24), అమిత్రాయ్ (20) ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన కార్మికుల భద్రతను పట్టించుకోని యాజమాన్యం నిర్లక్ష్యం వెల్లడిస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన కెవిఆర్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు డి.జి.నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జె.చంద్రశేఖర్ తదితరుల బృందాన్ని యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడం, పట్ల యాజమాని చర్యను ఖండించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు..
యూనియన్ డిమాండ్లు
- మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి.
- ప్రతి కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలి.
- పరిశ్రమల ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలి.
- టెక్నికల్ పనులు అర్హతలేని కాంట్రాక్ట్ కార్మికుల చేత చేయిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.
- వలస కార్మికుల హక్కులు కాపాడుతూ, చట్టప్రకారం రిజిస్టర్ మెయింటెన్ చేయాలి. యాజమాన్యం బాధ్యత గల వైఖరిని తీసుకోకపోతే మైగ్రేట్ కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆపాలని, మానవత్వంతో వ్యవహరించాలని కోరింది. ఈ కార్యక్రమంలో
కేఎవిఆర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ జె.చంద్రశేఖర్, మేడ్చల్ జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎర్ర అశోక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.