నేను శాసనసభ స్పీకర్ అయింది అంటే అంబెడ్కర్ రిజర్వేషన్ల బిక్షనే.
వికారాబాద్ :
వికారాబాద్ పట్టణం ఎన్నేపల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి 12 అడుగుల కాంస్య విగ్రహన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్.
పాల్గొన్న శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి , పరిగి, చేవెళ్ల, తాండూరు శాసనసభ్యులు టి. రాంమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, బి. మనోహర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, దళిత సంఘాల నాయకులు, సభ్యులు.

ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రదాత, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మబందువు, భారతరత్న డాక్టర్ భీం రావు అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు.
వికారాబాద్ పట్టణ ముఖద్వారం ఎన్నేపల్లి చౌరస్తాలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్ కు ఒక గౌరవం లభించింది.
అంబేడ్కర్ ఒక చరిత్ర కాదు నేటి వాస్తవానికి ప్రతీక. ఈరోజు దేశంలోని కోట్లాది మంది దళిత, గిరిజనులు తలేత్తుకుని బ్రతుకు తున్నారు అంటే ఆ దైర్యం పేరు అంబేడ్కర్.
విద్యా, ఉద్యోగాలు, రాజకీయ, సామాజిక రంగాలలో తమ వాటాను పొందుతూ, ప్రజాప్రతినిధులు అవుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్.

తాను పడిన కష్టాలు, తాను అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడదని అంబేడ్కర్ రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రాన్ని మనకు ఇచ్చాడు.
అంబేడ్కర్ దారి చూపించారు, ఆ దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలను అందుకోవాలి. పూరి గుడిసెలో, దళిత వాడలలో, గిరిజన గూడేలలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు అంటే దానికి ఏకైక కారణం అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రం.