హైదరాబాద్ :
పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్‌డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటలకు మొదలైంది. మొదట నగరంలో పలుచోట్ల సైరన్లు మోగాయి. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సైరన్లు మోగాయి. ప్రధాన కూడళ్లు, అపార్ట్మెంట్ల వద్ద సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కోసం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రజలు, సహాయక సిబ్బంది వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించేందుకు పోలీసుల మాక్‌డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహణ జరిగింది.నానల్‌నగర్, కంచన్‌బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. సివిల్ మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, రక్షణశాఖ, అగ్నిమాపకశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో అధికారులు మాక్ డ్రిల్ జరగ్గా.. వైమానిక దాడి జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు అవగాహన కల్పించారు. దాదాపు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది.