ఏఎస్ రావు నగర్ హౌసింగ్ సొసైటీలో భారీ అవినీతి

Facebook
X
LinkedIn

అవినీతికి పాల్పడిన కే కృష్ణమూర్తి, ఎం రామమూర్తి,, ఎల్ రాజేశ్వరరావుల పై చర్యలు తీసుకోవాలి

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి కంప్లైంట్ చేసిన ఏఎస్ రావు నగర్ మేనేజింగ్ కమిటీ

అవినీతికి పాల్పడ్డారనే ఎన్నికల్లో ఓడించారు, అయినా సిగ్గు లేకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.

తెలుగునాడు, హైదరాబాద్ :

డాక్టర్ ఏఎస్ రావు నగర్ హౌసింగ్ సొసైటీలో భారీ అవినీతికి పాల్పడిన కే కృష్ణమూర్తి ఎం రామమూర్తి ఎల్ రాజేశ్వరరావు వారి అనుచరులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శిక్షించాలని ఏఎస్ రావు నగర్ మేనేజింగ్ కమిటీ కోరుతున్నది. ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజావాణి కార్యక్రమంలో అవినీతికి పాల్పడ్డ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేనేజింగ్ కమిటీ వినతిపత్రం అందించారు.

భారతదేశము గర్వించదగిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఏ.యస్. రావు గారి పేరు మీద ఏర్పాటు చేసుకున్న కాలనీ హౌసింగ్ సొసైటీలో ఎప్పుడూ జరుగనటువంటి భారీ అవినీతికి పాల్పడిన కె. క్రిష్ణమూర్తి, యం. రామమూర్తి మరియు ఎల్. రాజేశ్వర రావుల ముఠా అవసరమున్నవి-లేనివి (ప్రాజెక్టులు) పనులు చేసారు. డా. హోమి జె భాభా కమ్యూనిటీహాల్ కు సోలార్ సిస్టమ్, ఫ్రంట్ ఎలివేషన్, మినీ వాటర్ సంప్, వాటర్ ఫౌంటేన్, టాయిలెట్స్ కట్టడములో మరియు కమ్యూనిటీ హాలుకు చెందిన టెంట్ హౌజ్ ఐటమ్స్, ఎలక్ట్రిల్ మరియు ఇతర కాంట్రాక్టర్ల ద్వారా సుమారు 50 లక్షల రూపాయల వరకు సొసైటీ సభ్యుల సొమ్ము దోచుకున్నారని ఏఎస్ రావు నగర్ మేనేజింగ్ కమిటీ తెలిపారు.

డా|| హోమి జె బాబా కమ్యూనిటీ హాలుకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు టెండర్ వేయలేదు. M/s. గ్రీన్స్టిక్ ఇండియా ప్రై. లిమిటెడ్ అనే ఒకే ఒక కాంట్రాక్టర్ను పిలిచి 50 KW కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. కాని 45KW మాత్రమే ఏర్పాటు చేశారు. దీనికి గాను GST తో కలిపి రూ.28,40,000/- చెల్లించారు. మార్కెట్ రేటు ప్రకారం 1 KW కు రూ. 37,000/- లు మాత్రమే, దీని ప్రకారం 45KW 5 45 x 37,000/- 2 = 5. 16,65,000/- GST 14% . 2,33.000/-లు ఇది మొత్తం రూ.18,98,000/- లు మాత్రమే. ఈ ఒక్క ప్రాజెక్ట్లనే 10 లక్షల రూపాయల వరకు తేడా ఉన్నది దీని ప్రకారం వీరు చేసిన మొత్తం ప్రాజెక్ట్లలో ఎంత అవినీతికి పాల్పడ్డారో తెలుస్తుంది.

    M/s. ఇంటీరియర్-8 అనే కాంట్రాక్టరుతో 4 పనులకు గాను రూ.66 లక్షల రూపాయల విలువ గల వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా GST చెల్లించలేదు.

    మెజారిటీ పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న సందర్భములో చూస్తూ ఉండలేక కె. సోమయాచారి సెక్రటరి పదవికి రాజీనామా చేసిన తరువాత కేవలం 20 నెలల వ్యవధిలో (ఆగష్టు 2022 నుండి ఫిబ్రవరి 2024 వరకు) అవినీతికి పాల్పడ్డారని తెలియజేస్తున్నాము వీరి ముఠాను చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాలని ఏఎస్ రావు నగర్ మేనేజింగ్ కమిటీ కోరుచున్నారు.

    29 ఫిబ్రవరి 2024న జరిగిన ఎన్నకలలో ఈ అవినీతి పరులను సోసైటీ సభ్యులును చిత్తుగా ఓడించి, అత్యధిక మెజారిటీతో ఇప్పుడున్న కమిటీని గెలిపించారు. అవినీతికి తావు లేకుండా కాలనీ వాసులకు అవసరమున్న పనులను (ప్రాజెక్టులను) పూర్తి చేస్తున్నామని వారు తెలిపారు. ఓడిపోయిన దోపిడి ముఠా వారు మరియు వారి అనుచరులు చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు, వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవినీతికి తావు లేకుండా నిజాయితితో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని ఏఎస్ రావు నగర్ మేనేజింగ్ కమిటీ తెలిపారు.