షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. మల్లాపూర్ ఎస్వి నగర్ లో ఘటన

Facebook
X
LinkedIn

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత నెమలి అనిల్ కుమార్

తెలుగునాడు, మల్లాపూర్ :

ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మల్లాపూర్ డివిజన్ ఎస్వి నగర్ స్ట్రీట్ నెంబర్ 1 లో నివాసం ఉండే కోటేశ్వరరావు అలియాస్ కొటేశ్ ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలు ఫర్నిచర్ వస్తువులు దగ్ధమయ్యాయి. తెలుసుకున్న మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని కొటేశ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.నిరాశ్రయులయన కొటేశ్ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని అనిల్ కుమార్ హామీ ఇచ్చారు.