కార్మిక హక్కుల పరిరక్షణకు ఉద్యమం : సిహెచ్. భాస్కర్ రెడ్డి

Facebook
X
LinkedIn

ఈసీఐఎల్‌ లో ఘనంగా మే డే వేడుకలు..

తెలుగునాడు, హైదరాబాద్ :

కార్మిక హక్కుల పరిరక్షణకు ఉద్యమంలో ముందుంటామని ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్. భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగాఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పరిశ్రమ ఎదుట ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ నుఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్.భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలవుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలతో కలసి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలియజేశారు.
కార్మికుల ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు వేతన సవరణ (Wage Revision) తక్షణమే అవసరమని, దీనిని సమర్థవంతంగా సాధించేందుకు అందరూ ఐక్యంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) యాంత్రీకరణ వల్ల ఉద్యోగ నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని అత్యవసర అవసరాలకు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. దీనివల్ల సామాన్య కార్మికులకు నష్టమవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రపంచ పోటీకి తగిన విధంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, ఉత్పాదకత, సేవల నాణ్యతను మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ యూనియన్ నాయకులు, శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు సామూహికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జోషి, కోశాధికారి ప్రవీణ్, నాయకులు డేవిడ్, రాజశేఖర్, బాలక్రిష్ణ,.శ్రీధర్ యూసఫ్, వర్లు, గండాలు, పవన్, నరేందర్ రెడ్డి, రమణ, లక్ష్మయ్య, బి.శ్రీను, బాల్ సింగ్, సోమరాజు, ఎ.శ్రీధర్, శ్రావణ్, ముఖేష్, అచ్చిబాబు, పోసిబాబు, ప్రశాంత్, శివశంకర్, యాదగిరి, జయశంకర్, జనార్దనరెడ్డి, కె.శివకుమార్, పి.శ్రీధర్, బి.వెంకటేష్, ఆంజనేయులు, భీంరెడ్డిలక్ష్మి, బి.రమేష్, శివకుమార్, విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.