బాలిక చదువుకు ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలుగునాడు, వరంగల్ :
వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్ లో భూభారతి చట్టం-2025 అవగాహన కార్యక్రమంలో పాల్గొనడానికి వేదిక వద్దకు చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడే ఒక వృద్ధురాలు కాగితం చేతిలో పట్టుకొని దీన స్థితి లో ఏదో అవసరం కోసం వేచి చూస్తున్నట్లుగా ఉండడాన్ని గమనించిన మంత్రి స్వయంగా వేదిక పై నుండి నిలబడి ఆ వృద్ధురాలిని వేదిక మీదకు ఆప్యాయం గా పిలిచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా.. అని సమస్యను గురించి ఆరా తీయగా.. ఆ వృద్ధురాలు బదులిస్తూ తన పేరు వేల్పుల ఊర్మిళ అని 41 వ డివిజన్ శంభునిపేటలో తన నివాసమని, తన మనవరాలు వేల్పుల లిటి ఇటీవల 4 వ తరగతి పూర్తి చేసుకుని సెయింట్ గాబ్రియల్ పాఠశాలలో 5 వ తరగతి లో ప్రవేశానికి పరీక్ష రాసి సీటు సాధించడం జరిగిందని, కానీ లిటి తల్లిదండ్రులు మనస్పర్ధల వల్ల వేరు గా ఉంటున్నారనీ, తన మనవరాలికి సీటు దక్కినప్పటికిని చదివించే స్తోమత తనకు లేదని మంత్రి వద్ద వాపోగా, వెంటనే స్పందించిన మంత్రి చదువు కోవడానికి అయ్యే వ్యయాన్ని భరిస్తానని ప్రకటించి మంత్రి చూపిన ప్రోత్సాహీంచడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.