తెలుగునాడు, హైదరాబాద్ :
“తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాకపోవచ్చని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు, తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు లేబర్ కమిషనర్‌ను కలిసి 21 డిమాండ్లను సమర్పించారు.
ప్రభుత్వం స్పందించకపోతే మే 7నుంచి సమ్మె తప్పదని వారు స్పష్టం చేశారు.
దీంతో ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ప్రజలు ముందుగానే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.”