ఉగ్రవాదం నశించాలి : సి పి ఎం

Facebook
X
LinkedIn

కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

తెలుగునాడు, హైదరాబాద్ :

ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదాన్ని అరికట్టాలి శాంతి భద్రతను కాపాడాలి అని కోరుతూ సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి సత్యం కార్యదర్శి ద సభ్యులు కోమటి రవి మాట్లాడుతూ కాశ్మీర్ లోని పైల్గాం ప్రాంతంలో కాశ్మీర్ పర్యాటకులను ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్చి చంపడం జరిగింది . ఈ దాడిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఏ మతము వారైనా ఈ విధమైన చర్యలకు పాల్పడడం సహించరానిదని అన్నారు. ఈ దాడిలో ముస్లిములు హిందువుల పైన దాడి చేసి చంపినప్పటికీ అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఇతర హిందువులను కాపాడటంలో తమ ప్రాణాలకు తెగించి కాపాడిఆశ్రయం కల్పించారని అందుకు వారికి సిపిఎం పార్టీ అభినందనలు జేజేలు తెలియజేస్తున్నది. అయితే దీనిని కొంతమంది మతమురంగు పులిమి రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేయటం సరైనది కాదని అన్నారు. భద్రతా దళాల నిఘ వైఫల్యం వలన ఈ దాడులు జరిగినట్లు మనకు స్పష్టం అవుతున్నది. దేశభద్రతను కాపాడే దానికోసంసైన్యాన్ని రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటిఅవసరం ఉన్నప్పటికీ గత మూడు సంవత్సరాల నుండి ఎలాంటి సైన్యాన్ని రిక్రూట్మెంట్ చేయకపోవడం దేశభద్రత ప్రమాదంలో ఉన్నదని అర్థమవుతున్నది.కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుచేసి ి కేంద్ర పాలిత ప్రాంతముగా తయారుచేసి అక్కడ శాంతి భద్రతలో కాపాడుతున్నామని గొప్పలు చెప్పినటువంటి వారుఈ దాడులను రాజకీయం చేస్తున్నారు . దాదాపు లక్ష 80 వేల మంది సైనికులను రిక్రూట్మెంట్ చేయవలసిన అవసరం ఉందని మాజీ సైనిక అధికారులు తెలియజేస్తున్నారు. హిందువులకు ప్రమాదం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న మోడీ హిందువు ,అమితశ హిందువు భారతదేశ ప్రభుత్వం లో ఉన్న ఉన్న బిజెపి వారు హిందువులే మరి అలాంటప్పుడు హిందువుల రక్షణ కోసం దేశభద్రత కోసం రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి సైన్యాన్ని ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదుఅని అన్నారు.

కావున ఈ సంఘటనను పాకిస్తాన్ కు పాకిస్తాన్ ముస్లింల మీద నెట్టి వేసే నేపము చేయకుండా సమగ్రమైన దేశభద్రత కు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని వెంటనే రిక్రూట్మెంట్ ను చేయాలని తద్వారా కాశ్మీర్లో శాంతి పరిరక్షణకు పూనుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే. చంద్రశేఖర్ జి శ్రీనివాసులు ఐ. రాజశేఖర్, వినోద జిల్లా మాజీ కార్యదర్శి పి ఎస్ ఎన్ మూర్తి జిల్లా కమిటీ సభ్యులు లింగస్వామి, వెంకన్న ,సబితా ,నరేష్ ,శంకర్ పార్టీ నాయకులు
పి .గణేష్ ఏం. శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ, దేవి రెడ్డి ,జివి రావు, , శివరామకృష్ణ,వెంకటాచారి , రవీందర్ రెడ్డి ,సంతోష్,యాదగిరి , మహిళలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు .