తెలుగునాడు హైదరాబాద్ :
డా. బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జమ్మూ కాశ్మీర్, పెహల్గంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి క్యాండిల్ లైట్ తో నివాళులు అర్పించిన ఎంపీ ఈటల రాజేందర్. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు డా. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చింతల రాంచంద్ర రెడ్డి, ఏవిఎన్ రెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి నివాళులర్పించారు.
నిన్న పాకిస్తానీ ఉగ్రవాదుల తూటాలకు బలైన భారతమాత ముద్దుబిడ్డలకు నివాళులు అర్పించాము. వారి కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాము. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. టెర్రరిజం, టెర్రరిజానికి అండగా ఉన్న దేశం తప్పుకుంటా మూల్యం చెల్లిస్తుంది.
370 ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ ఊపిరి పీల్చుకొని స్వేచ్ఛ స్వాతంత్రాలు పొంది అభివృద్ధి జరుగుతుంది.

కళ్ళుకుట్టి పాకిస్తాన్లో శాంతిభద్రతలు కాపాడుకోలేని ఆ ప్రభుత్వాలు భారతదేశంను అస్థిరపరచడానికి నీచమైన కుట్రలో భాగం ఈ దాడి.
మీరు హిందువులా ముస్లింలా అని అడిగి ఏరుకోరి మన బిడ్డల్ని చంపారు.
మన వారి రక్తాన్ని కళ్ళజోసిన వారి అంతమే మన కర్తవ్యం అని ప్రతిన బూనుదాం.
ప్రపంచ దేశాలు అన్ని భారత్ కు మద్దతు ప్రకటించాయి.
టెర్రరిజం ఎక్కడున్నా అంతం చేయాల్సిందే.
మోడీ నాయకత్వంలో 11 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్నాం. టెర్రరిస్ట్ దాడులు లేకుండా, బాంబుల తుపాకుల మోతలు లేకుండా దేశం ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గమైన చర్యకు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. ఈ పిరికిపందల చర్యను సంపూర్ణంగా ఖండిస్తున్నాము.