తెలుగునాడు, హైదరాబాద్ :
ప్రముఖ ఆంగ్ల భాష నిపుణురాలు,విద్యావేత్త, సాహితీవేత్త సెయింట్ జోసెఫ్ డిగ్రీ మరియు పీజీ కళాశాల కింగ్ కోటి ఆంగ్లభాష విభాగం అధినేత హెచ్ ఓ డి డాక్టర్ ఏ. సంగీత ను ఈ ఏడాది విలియం షేక్స్పియర్ ఎక్స్లెన్సీ అవార్డు 20 25 ను ఎంపిక చేసినట్టు వికాస చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ కె రామ్ గోపాల్ రెడ్డి నేడు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి ఒక్కరికి ఇచ్చే అవార్డు ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం సందర్భంగా మరియు విలియం షేక్స్పియర్ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డును ఈనెల బుధవారం 23వ తేదీన కింగ్ కోటి లోని సెంట్ జోసెఫ్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ అవార్డు ప్రధానం చేస్తామన్నారు. ప్రముఖ ఆంగ్ల విద్యావేత్త, ఉపన్యాసకురాలు, సాహితీవేత్త డాక్టర్ సంగీత మోత్కూర్ కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆంగ్లభాష విభాగం అధిపతిగా 21 సంవత్సరాలుగా అందరి మన్నలను పొంది, ఆంగ్లభాష అభివృద్ధికై పనిచేస్తున్నారు.
డిగ్రీ పీజీ విద్యార్థులకు ఆంగ్లభాష నైపుణ్యాన్ని ప్రోత్సహించడం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, స్టాఫ్ స్కిల్స్, బోధన ప్రొఫైల్స్ ను రూపొందించడం మరియు అమలు చేయడం ఆమె అభిరుచి. డాక్టర్ సంగీత యుజిసి స్టాఫ్ రిఫ్రిషర్ కోర్స్ కోసం షెడ్యూల్ రూపకల్పన, అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఫౌండేషన్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, తెలంగాణ పోలీసుల కోసం కమ్యూనికేషన్ మరియు రిపోర్టింగ్ రైటింగ్ లో ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. నిజాం కళాశాల నుండి ఇంగ్లీష్ లిటరేచర్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మే ఇంగ్లీష్, మరియు పీహెచ్డీ పట్టా పొందారు. డాక్టర్ సంగీత ఆంగ్ల సాహిత్య కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మరియు టీచింగ్ పై పరిశోధనల పత్రాలను సమర్పించి ప్రచురించింది. ఈ సందర్భంగా తెలంగాణ మేధాలు ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ డాక్టర్ సంగీతకు శుభాకాంక్షలు తెలిపారు.