‘యంగ్ స్కాలర్ న్యూరో సర్జన్’ అవార్డ్ అందుకున్న డాక్టర్ రాజశేఖర్ కానూరి

Facebook
X
LinkedIn

న్యూరో సర్జరీ లో ఉత్తమ ప్రతిభ.ఆలిండియా పరీక్షలలో టాప్  ఆరుగురి లో ఒకరు

తెలుగునాడు, హైదరాబాద్ :

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో న్యూరో సర్జరీ లో సూపర్ స్పెషాలిటీ చేస్తోన్న డాక్టర్ రాజశేఖర్ కానూరి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలిండియా పరీక్షలలో టాప్  ఆరుగురి లో ఒకరిగా నిలిచి, అహ్మదా బాద్ టోరెంట్ ఫార్మా కంపెనీ వారి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘యంగ్ స్కాలర్ న్యూరో సర్జన్’ అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరియు వెస్సో సేవా సంస్థ ట్రస్టీలు హర్షం వ్యక్తం చేశారు.రాజశేఖర్ భార్య డాక్టర్ కొవిద పంజాగుట్ట నిమ్స్ లో ప్లాస్టిక్ సర్జరీలో శిక్షణ పొందుతూ సూపర్ స్పెషాలిటీ విజయవంతంగా పూర్తి చేశారు. స్వర్గీయులైన డాక్టర్ రాజశేఖర్ తండ్రి కానూరి వివి సత్యనారాయణ హైదరాబాద్ ఆంధ్ర బ్యాంకు హెడ్ ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ గా సేవలు అందించారు. రాజశేఖర్ తల్లి సత్యవతి గృహిణిగా బాధ్యతలు నెరవేర్చుతుండగా, అన్న కళ్యాణ్ చక్రవర్తి బెంగళూరులో కర్ణాటక బ్యాంకులో ఐటి మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.