తెలుగునాడు, హైదరాబాద్ :
జనవిజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజ్గిరి మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం గోడపత్రికను చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరిండెంట్ జి.రామచంద్రన్ మరియు ఓపెన్ జైలు జైలర్ శ్రీనివాస్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనవిజ్ఞాన వేదిక చేపడుతున్న ఈ ఉచిత శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు తమ సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకునేలా, పట్టుదలతో నేర్చుకునే విధంగా శిక్షణ ఇచ్చే విధంగా శిబిరాలు రూపొందించబడినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తప్పక ఈ శిబిరాల్లో పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తోట శ్రీనివాస్, జిల్లా కోశాధికారి జెన్నీ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలోని అన్ని మండలాలలో ఈ వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఇంట్లో లేదా పరిసరాల్లో లభ్యమయ్యే సాధారణ వస్తువులతో చిన్న ప్రయోగాలు చేయడం ద్వారా సిలబస్ సులభంగా అర్థం చేసుకునేలా శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. చదువు మీద భారం కాకుండా ఆసక్తిగా నేర్చుకునే విధానాన్ని ఈ శిబిరాలు అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు.
శిక్షణ శిబిరాల వివరాలు:
కాప్రా మండలం: శ్రీ చక్రి విద్యానికేతన్ హై స్కూల్
మల్కాజ్గిరి మండలం: జేవియర్ హై స్కూల్
తేదీలు: 2025 ఏప్రిల్ 24 నుండి మే 5 వరకు
సమయం: ఉదయం 8:00 నుండి 10:00 వరకు
కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, కాప్రా, కమలానగర్, ఏఎస్ రావు నగర్, మౌలాలి పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 94915 50128, 92465 43662, 89192 04421
ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు నాగరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.