తెలుగునాడు, కాప్రా :
కందుకూరి వీరేశలింగం, చార్లీ చాప్లిన్ లు ప్రజల్ని అభ్యుదయ పదంలో నడిపించిన గొప్ప మహానుభావులని సామాజిక ఉద్యమ నాయకులు కోమటి రవి అన్నారు.
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి మరియు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నటులు చార్లీ చాప్లిన్ జయంతి కార్యక్రమం కమలానగర్ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ఈసందర్బంగా సామజిక ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడుతూ చార్లీ చాప్లిన్, కందుకూరు వీరేశలింగం పంతులు ప్రజల్ని సామజికంగా చైతన్య పరిచారని పేర్కొన్నారు. ప్రజల్లోని మూడు విశ్వాసాలు పారద్రోలి అభ్యుదయ పదంలో నడిపిన మహానుభావులు అని కొనియాడారు.
అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి ఎం జగ్గరాజు చార్లీ చాప్లిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ వెంకటరమణయ్య కందుకూరి వీరేశలింగం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షుడు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ చార్లీ చాప్లిన్ విశ్వనటుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్య నటుడుతో పాటు సామాజిక చైతన్యాన్ని కలిగించిన గొప్ప మనిషి అని అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగునాట సంస్కరణ ఉద్యమాన్ని నడిపిన గొప్ప మహనీయుడని అన్నారు.
ఎం జగ్గరాజు మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం ఒకనాడు పూలే ఎలా సంస్కరణలు తీసుకొచ్చారో తెలుగు నాట అటువంటి సంస్కరణ తీసుకొచ్చిన మరో పూలేగా గణతికెక్కారు అని చెప్పారు. వితంతు వివాహాలు చేయటం వారి పిల్లలను పెంచి పోషించటం చేశారని చెప్పారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పట్టుదలతో కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే మాదిరిగానే కందుకూరి వీరేశలింగం కూడా, వారి భార్యను చదివించి విద్యను ప్రోత్సహించారని చెప్పారు. అటువంటి మహనీయులను మనం నిరంతరం అధ్యయనం చేసి వారి బాటలో నడవాలని చెప్పారు. చార్లీ చాప్లిన్ ప్రపంచానికి మానవత్వం దాని ప్రయోజనాలను వెలిగెత్తి చాటారని చెప్పారు. పెట్టుబడిదారీ విశృంకళత్వాన్ని దానివలన ప్రజలను చైతన్య పరచడానికి సినిమా రంగాన్ని ఉపయోగించుకుని ముందుకు నడిపించారని చెప్పారు.
ఈ సందర్భంగా కోమటి రవి మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం, చార్లీ చాప్లిన్ గారలు ప్రజల్ని చైతన్యపరిచి అభ్యుదయ పదంలో నడిపించిన గొప్ప మహానుభావులని అన్నారు. శారద , శ్రీమన్నారాయణ వారి చేసిన కృషిని కొనియాడారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఏ ఆశయం కోసం పనిచేశారో దానికి భిన్నంగా ఇనాటి ప్రభుత్వం వీరేశలింగం పంతులు గారి ఆస్తులను ఎండోమెంట్ వారికి అప్పజెప్పటం దుర్మార్గమని అన్నారు. వీరేశలింగం బావాలను వ్యతిరేకించే సంస్థలకు అప్పజెప్పడం సరైనది కాదని అన్నారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు సభ్యులందరూ పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేకే ఉన్నికృష్ణ, గౌస్య, శోభ, శారద, ఉమామహేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాస్, వెంకటరమణయ్య, జగ్గరాజు, యాదగిరి రావు తదితరులు పాల్గొన్నారు.