దళిత జనసమితి రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ యాదగిరికి సన్మానం

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్‌ :


రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 134వ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ చేస్తూ, అంబేద్కర్‌ ఆశయ సాధనలో దళిత సంఘాల్లో పనిచేస్తున్న, దళిత నాయకుల్ని గుర్తిస్తూ, వారు చేస్తున్న కృషికి, నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ఘనంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ ప్రజా సమస్యలపై పోరాటం అనేక ఉద్యమాలు చేస్తూ, నిత్యం ప్రజా శ్రేయస్సు కోరే, ఉద్యమ నాయకుల్ని గౌరవంగా సన్మానిస్తూ, వారికి అవార్డుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఇటికే రాజు మాదిగని కార్య నిర్వహణ చైర్మన్‌ గా, చెరుకు రామచంద్రంని వైస్‌ చైర్మన్‌ గా బాధ్యతలప్పగిస్తూ, ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రంగాల్లో ఉద్యమాలు చేసి సమస్యలపై నిర్విరామంగా పోరాటం, చేసిన వారిని ఘనంగా సన్మానిస్తూ అవార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా దళిత జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరికి నిన్న రవీంద్రభారతిలో అంబేద్కర్‌ జయంతి వేడుకలకు ఆహ్వానించి కార్యనిర్వహకులు మేడి పాపయ్య గారి చేతుల మీదుగా దళితరత్న అవార్డు ప్రధానం చేస్తూ పూలమాల మరియు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జ యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘనంగా అంబేద్కర్‌ ఉత్సవాల నిర్వహణ చేసి, అంబేద్కర్‌ వాదుల్ని ఉద్యమ నాయకుల్ని గుర్తించి ఈ విధంగా దళితరత్న అవార్డు ప్రధానం చేయడం. చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో రెట్టించిన ఉత్సాహంతో, అంకితభావంతో పని చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె సంపత్‌, రాష్ట్ర కార్యదర్శి భావనపల్లి గంగాధర్‌, రాష్ట్ర నాయకులు ఎదునూరి సంపత్‌, మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.