మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి : మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్,

మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని నాచారం లో ఘనంగా నిర్వహించారు. సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా, పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అన్నివర్గాల ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఆయన సేవలకు గుర్తుగా ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణా రెడ్డి, రాజా రెడ్డి, మహేష్ యాదవ్, బొల్లం నరేష్, నూతలకంటి రాజు, రమాకాంత్ లోకే, లోకేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, కిషోర్ కుమార్, తన్నీరు రాకేష్, సునీల్ రెడ్డి, క్రాంతి కిషోర్, బాలు యాదవ్ మరియు ఎస్.ఎస్.ఎస్ యువసేన సబ్యులు విజయ్ కుమార్ సింగ్,శ్రీధర్ జాదవ్, కర్ణాకర్, శ్రీకాంత్, అక్షంత్, వాలి, కమల్, సెబాస్టియన్, జెస్సీ, వహీద్, బ్లీసీన్, నాసిర్, అలోక్, సాథ్విక్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.