- సామాజిక కార్యకర్త కోలా రవీందర్ ముదిరాజ్
తెలుగు నాడు, కుత్బుల్లాపూర్:
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ దేవస్థానం వద్ద ప్లాస్టిక్ ఇస్తారు వివారించే విషయమై సామాజిక కార్యకర్త, ప్రకృతి ప్రేమికులు కుల రవీందర్ ముదిరాజ్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ప్లాస్టిక్ వంటి పదార్థాలను వాడకుండా, ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడాలనే సదుద్దేశంతో ప్రజలలో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకాన్ని నివారించే టందుకు తన వంతు కృషిగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మందిరం వద్ద వచ్చే భక్తులకు స్థానిక వ్యాపారస్తులు విషపూరితమైన ప్లాస్టిక్ ఇస్తర్లు ఇచ్చి పర్యావరణాన్ని మరియు ప్రజల ఆరోగ్యాలు చెడగొడుతున్నారని వాపోయారు.ఇట్టి విషయమై స్థానికంగా ఉండే జూనియర్ అసిస్టెంట్ ప్రతాపరెడ్డి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.మోదుగ, అరటి,ఇస్తరాకులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని లేని చో, స్టీల్ ప్లేట్లు,పింగాని ప్లేట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈఓ,స్పందిస్తూ స్థానిక నాయకులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా కోలా రవీందర్ మాట్లాడుతూ డ్యాం వద్ద ఈతరాని వారు ఎంతో మంది నీటిలో దిగి తమ విలువైన ప్రాణాలని కోల్పోతున్నారని, సందర్శనార్థం వచ్చినా యాత్రికుల కొరకు ఒక బ్యానర్ ఏర్పాటు చేసి, “ఈతరాని వారు నీటిలో దిగరాదని, ఈత ఒక సాధన” అక్కడ బ్యానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండే నాయకులతోపాటు రవి యాదవ్, రాములు ముదిరాజ్, యోగేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
