తెలుగునాడు,కీసర:
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సెంటు బేటానియా స్కూల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తే..అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం అని అబ్దుల్ కలాం తెలిపారు.విద్య అనేది శాంతి, న్యాయం, స్వేచ్ఛ మరియు అందరికి సమానత్వం తో కూడిన ప్రపంచాన్ని సాధించే సాధనం. అలాంటి విద్య ను అందించే గురువు లందరూ పూజనీయులు.చదువు లేకుండా మంచి జీవితం సాధ్యం కాదు. విద్యార్ధి కూర్చొని ఉండే తరగతి గది అంటే నాలుగు గోడలు కాదు నాలుగు దిక్కులు.ప్రపంచాన్ని మార్చాలంటే శక్తి వంతమైన ఆయుధం చదువు ఒక్కటే అని నెల్సన్ మండేలా తెలిపారు. విద్యార్థులు అందరూ ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో, తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి.విద్య అనేది నీడ లాంటిది, దాన్ని మననుంచి ఎవ్వరు వేరు చేయలేరు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి మరియు వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ టిఆర్ఎస్ మున్సిపల్ ప్రెసిడెంట్ తెల్ల శ్రీధర్, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్,కౌన్సిలర్ హరిబాబు, ముప్పు శ్రీనివాసరెడ్డి, నాయకులు పాల్గొన్నారు