తెలుగు నాడు, చర్లపల్లి :
ఈసిఐఎల్ హౌజ్ బిల్డింగ్ సోసైటి మ్యానేజింగ్ కమిటిని బుదవారం ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి డిప్యూటి రిజిస్టార్ పి.ఈశ్వరయ్య అధ్వర్యంలో సోసైటి ఎన్నికల్లో డైరెక్టర్లుగా గెలుపొందిన వారికి ఎన్నిక నిర్వహించారు. బూడిద శ్రావణ్ కుమార్ గౌడ్ ను అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోసైటి ఉపాధ్యాక్షురాలుగా సిహెచ్.పద్మిని, కార్యదర్శిగా ఎమ్.జగ్గారాజు, కోషాధికారిగా కె.ఇందిరలను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా పి.బిక్షపతి, ఏవీఎస్ వర్మ బి.బాలయ్యలు ఉన్నారు. ఎన్నికల అధికారి ఈశ్వరయ్య నూతన కమిటితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాలనీవాసులు, అధికారులు ప్రజాప్రతినిదుల సహకారంతో ఈసినగర్ కాలనీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.