షర్మిల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
— పిల్లలకు, పెద్దలకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన టి.కాలేషా, షర్మిల.
— పతంగిలో ప్రమాదకరమైన తంగూస్ ధారాలను వాడకండని సూచన.
సుమారు 500 మంది పిల్లలకు బరెల్లి మాంజా, పతంగిలను టి.కాలేషా, షర్మిల దంపతులు ఉచితంగా పంపిణీ చేశారు. షర్మిల చారిటబుల్ ట్రస్ట్ కు సహాయకారి మరియు ట్రస్ట్ నిర్వాహకురాలైన షర్మిలకు అత్యంత ప్రియమైన స్నేహితురాలు నాగసూర్య కుమారి భర్త లక్ష్మీ నరసింహ ప్రసాద్ స్వర్గస్థులైయ్యారు. వారికి సంకీర్త్, లలితాధిత్య అనే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారి పేర్లమీద 2025, జనవరి-8, బుధవారం రోజున మేడ్చల్, కాప్రా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల బాలాజీనగర్ లోని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాకురాలు షర్మిల నివాసంలో ఈపై కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా టి.కాలేషా, షర్మిల పిల్లలకు, పెద్దలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లల మానసిక ఎదుగులకు పతంగీ(కైట్స్)లు ఎంతోగానో ఉపయోగ పడుతాయని అన్నారు. వారి ఆనందం పెద్దలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని గుర్తుచేశారు. పిల్లలతోపాటు పెద్దలు కూడ కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ సందర్భంగా సందడి చేస్తారని, పతంగిల ఆట లో మమతానురాగాలు వెల్లువిరుస్తాయని గుర్తుచేశారు. ఎన్నికోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన రాని మానసిక, శారీరక ద్రుడత్వం ఈ పతంగిల ఆటలో ఉంటాయనే గ్రహించి, తన స్నేహితురాలి పిల్లలైన సంకీర్త్, లలితాధిత్య పేర్లమీద పిల్లలకు పతంగి, మాంజాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వయస్సుతో నిమిత్తం లేకుండా ఆహ్లాదకరమైన క్రీడ పతంగిల ఆట అని అన్నారు. మనిషిలో ఉన్న మానవత్వాన్ని, మంచిని మేల్కొలిపే స్నేహపూరితమైన పతంగిల ఆటంటే అందరు ఇష్టపడుతారని, కాని పతంగిల ఆటలో తంగూస్ అనే ధారాలను వాడకూడదని హెచ్చరించారు. ఇది చాల ప్రమాదకరమైనదని, ఇది మనుషులను గాయపర్చడమే గాక, ఒకోసారి ప్రాణాలు కూడా తీస్తాయని అన్నారు. మన సంతోషం కోరకు ఇతరుల సంతోషాన్ని, ఆనందాన్ని కొల్లగొట్టే తంగూస్ ను ఉపయోగించకండని విజ్ఞప్తి చేశారు. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవడంలోనే నిజమైన దేశభక్తికి, సౌభ్రాత్రుత్వానికి, లౌకిక స్పూర్తికి, దేశ ఐక్యతకు దోహద పడుతాయని సూచించారు. తద్వారా పౌర, ప్రజాస్వామ్య విలువలతో మనిషిని మనిషిగా ప్రేమించే సమాజం పతంగిల ఆటలో ఉన్నదని స్పష్టం చేశారు. చివరలో పతంగిలు ఎగురవేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్దలు మధ్యం లాంటి మత్తు పదార్థాలు సేవించి, ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని టి.కాలేషా, షర్మిల సూచించారు.